AP: ప్రధాని మోదీ దూరదృష్టికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఇంధన భద్రతకు బలమిచ్చేలా విశాఖ రిఫైనరీని శక్తివంతం చేశారని పేర్కొన్నారు. తూర్పు తీరప్రాంతం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరిస్తోందని చెప్పారు. ఏపీ పారిశ్రామిక మ్యాప్‌లో విశాఖ మరోసారి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ మరో కీలక మైలురాయిని నమోదు చేసిందన్నారు.