»Have You Seen The Poster Of Samantha Maa Inti Bangaram Gun In Hand
Maa Inti Bangaram: సమంత బంగారం పోస్టర్ చూశారా.. మెళ్లో తాళి.. చేతులో గన్
సమంత నటిస్తున్న తాజా చిత్రం పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. చేతులో గన్ పట్టుకున్న గృహిణిలా కనిపిస్తుంది. ఈ రోజు సమంత పుట్టిన రోజు కావడంతో తాజా పోస్టర్ వైరల్ అవుతుంది.
Have you seen the poster of Samantha maa Inti Bangaram.. Gun in hand
Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమా అప్డేట్ ఇచ్చింది. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదలైన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా పోస్టర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. పేరు సాఫ్ట్‌గా ఉంది కానీ పోస్టర్ వైలెంట్‌గా కనిపిస్తుంది. ఈ మోషన్ పోస్టర్ అంతా రెడ్ కలర్‌తో హైలెట్ చేశారు. అంతేకాకుండా సమంత చేతులో గన్ కూడా పట్టుకుంది. ఓ సాధారణ మహిళలా మెడలో తాళి, చేతికి గాజులు వేసుకొని చేతులో గన్ పట్టుకోవడంతో అసలు ఈ ఈ గృహిణి కథేంటి అనేది తెలుసుకోవాలనే కుతుహలం కలుగుతుంది. మరీ తన కథేంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
అయితే మా ఇంటి బంగారం అనే టైటిల్ తప్ప ఇతర ఏ సాంకేతిక బృంద వివరాలు తెలుపలేదు. ఈ చిత్రాన్ని తన సొంత ప్రొడక్షన్ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures)పై రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది కచ్చితంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో సిటడెల్: హనీ- బన్నీ (Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో త్వరలోనే సందడి చేయనున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.