ADB: నార్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఎంఆర్వో రాజలింగు ఆధ్వర్యంలో తొలి ప్రజావాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ పుల్లారావు, సర్పంచులు హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, మంచి నీటి సౌకర్యం కల్పించాలని అధికారులు ఆదేశించారు. నిధులను సరైన పనులకే వినియోగించాలని పేర్కొన్నారు.