GNTR: విజయవాడలో షాపింగ్‌కు వచ్చిన ఉండవల్లికి చెందిన వివాహిత అదృశ్యమైంది. ఆదివారం సత్యనారాయణపురంలోని డీ-మార్ట్‌కు భర్తతో కలిసి వచ్చిన ఆమె, ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. భర్త కిందకు వచ్చి చూసేసరికి ఆమె లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు.