AP: మంగళగిరి పానకాల నర్సింహస్వామిని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ధరమ్ గోకుల్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.