MLA Raghuramakrishna Raju: MLA RRR complaint against former CM Jagan, former CID DG
MLA Raghuramakrishna Raju: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాజీ సీఎం జగన్, సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే హత్యయత్నం చేశారని గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలోనే పోలీసులు మాజీ సీఎం జగన్, సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, సునీల్ కుమార్, మాజీ డీఎస్పీ పాల్పైన కేసు నమోదు చేశారు. అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగాం సురేశ్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.