»American Airlines Plane Tyre Blows On Runway Moments Before Takeoff
Tyre Blows : విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైరు.. తప్పిన పెను ప్రమాదం!
విమానం గాల్లోకి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపై దాని టైరు పేలింది. 174 మంది ప్రయాణిస్తున్న ఆ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Tyre Blows On Runway : ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడగలిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)కు చెందిన ఓ విమానం టేకాఫ్‌కి సిద్ధమైంది. రన్‌వేపై వేగంగా పరుగులు తీస్తున్న సమయంలో దాని టైరు పేలిపోయింది. దీంతో చక్రాల దగ్గర నుంచి మంటలు చెలరేగాయి. అది ఇంకా భూమ్మేదే ఉండటంతో పైలెట్ దాన్ని మెల్లగా కంట్రోల్ చేసి ఆపేశాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే గాల్లోకి వెళ్లాక ఈ ప్రమాదం జరిగి ఉంటే ల్యాండింగ్ సమయంలో ఏమై ఉండేదా? అని అంతా ఊహించుకుని భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో బుధవారం చోటు చేసుకుంది. అక్కడి టంపా ఎయిర్పోర్ట్ నుంచి ఫినిక్స్(Pheonix) నగరానికి బయలుదేరింది. టేకాఫ్ కోసం రన్‌వే మీదకు వచ్చి వేగం పెంచింది. మరి కొన్ని సెకెన్లలో అది గాల్లో లేవాలి. ఆ సమయంలో దాని టైరు పేలిపోయింది. చక్రాల్లోంచి నిప్పు రవ్వులు ఎగసిపడటం ప్రారంభించాయి. దీన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా ఫ్లైట్‌ని ఆపేశాడు. గాల్లోకి ఎగరనీయలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
ఈ విషయమై అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines ) ప్రతినిధి అల్ఫ్రెడో మాట్లడారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు తెలిపారు. తర్వాత మరో విమానంలో ఆ ప్రయాణికులందరినీ గమ్య స్థానానికి పంపించినట్లు చెప్పారు. ఈ ఘటనలో టంపా ఎయిర్‌పోర్ట్‌లో మిగిలిన విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది.
JUST IN: American Airlines flight 590 out of Tampa, Florida narrowly avoids disaster after multiple tires blow out during takeoff.
As the plane was picking up speed and seconds away from liftoff, the tires blew out.