KMR: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు వరద తాకిడి కొనసాగుతోంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2169 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1404.83 కాగా ప్రస్తుతం 1405.00 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 17.556 కాగా 17.802 టీఎంసీలకు చేరుకుందని ఏఈ సాకేత్ తెలిపారు.