TPT: శ్రీకాళహస్తిలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకీ తగ్గుతుండటం పట్ల కలెక్టర్ వెంకటేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1000 అబ్బాయిలకు 900 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. శ్రీకాళహస్తిలో మాత్రం 629 మంది ఉండటంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్ పై నిఘా ఉంచాలని ఆయన DMHOను ఆదేశించినట్లు సమాచారం.