AP: సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని ప్రజలు అనుకుంటున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. యువతకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు ఆ హామీ ప్రస్తావనే లేదని మండిపడ్డారు. ఆడపిల్ల నిధి, 50 ఏళ్లకే పెన్షన్ అన్నారని అవి కూడా ఎగ్గొట్టారని విమర్శించారు.