GNTR: టీడీపీ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం గుంటూరులో మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర రాజకీయాలకు చీడ పురుగుగా అభివర్ణించారు. ఆయనను అవినీతి తిమింగలం, మాఫియా డాన్, దోచుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తిగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని తరిమికొట్టాలని, దొంగలు రాజకీయాలలో ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.