W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ఛైర్మన్గా జనసేన నాయకుడు చాగంటి పార్థసారథి నియమితులయ్యారు. సభ్యులుగా దొంగ రామలక్ష్మి, గుండుబోయిన రాంబాబులను నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. సొసైటీ అభివృద్ధికి కృషి చేసి రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తానని పార్థసారథి తెలిపారు.