PPM: అగ్ని ప్రమాదాల నివారణపై పాలకొండ అగ్నిమాపక శాఖ ఎస్సై సర్వేశ్వరరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీతంపేట మండలం బుడగరాయిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ఇతరులను ఎలా రక్షించాలో వివరించారు.