RR: మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఎల్బీనగర్ జోన్, జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల జాబితాను వారికి తెలిపారు. వెంటనే పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.