SRD: సంక్షేమ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు వెంటనే పంట రుణాలను మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ రావు పాల్గొన్నారు.