KDP: జిల్లాలో 44 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, PCలు, WPCలు ఉన్నట్లు తెలిపారు.