NLG: ఈనెల 15న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నల్గొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి యూనివర్సిటీని బుధవారం ఆమె సందర్శించి, గవర్నర్ పాల్గొననున్న స్నాతకోత్సవ వేదికను పరిశీలించారు.