SKLM: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులలో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు తెలిపారు. బుధవారం నరసన్నపేట లోని బోర్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థులతో మమేకమవుతూ బోధన పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు హోంవర్క్, డిక్టేషన్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు.