AP: టీటీడీ ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్కు వేద పండితులు స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే, బదిలీపై వెళ్లిన మాజీ ఈవో శ్యామలరావుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.