TG: అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్, రామ్ వంజీ సుతార్ మరణం పట్ల BRS అధినేత KCR సంతాపం ప్రకటించారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి ప్రపంచస్థాయి ప్రతిభను కనబరిచి, శిల్పకళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన సుతార్ శిల్ప కళా సేవలను, అంబేద్కర్ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వ కారణమని అన్నారు. సుతార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.