E.G: మంత్రి లోకేశ్ శుక్రవారం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి సిటీలోకి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, డప్పులు, బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిభ కళాశాల విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ సెల్ఫీ దిగారు.