AP: కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచే యోచనలో ఉందని CM చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి పాటిల్‌తో భేటీ సందర్భంగా.. ఇప్పటికే కర్ణాటక భూసేకరణకు సిద్ధమైందని, ఎత్తు పెంచితే దిగువ రాష్ట్రాలకు కృష్ణానది నీటి కొరత ఏర్పడే ప్రమాదముందని వివరించినట్లు సమాచారం. ట్రిబ్యూనల్ నిర్ణయాల అమలుకు గైడ్ లైన్స్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది.