పచ్చి బఠానీలు చలికాలంలో పెద్ద మొత్తంలో పండుతాయి. పచ్చి బఠానీలో కొవ్వు పరిమాణం తక్కువగా ఉండగా.. ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బఠానీల ఎంపిక ఉత్తమం. ఎక్కువ క్యాలరీలు లేకుండా పొట్ట నిండిన భావన కలిగించడం వల్ల అవసరానికి మించి తినకుండా సహాయపడుతుంది. మాంసాహారం తీసుకోని వారికి ప్రోటీన్ లోపం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారు పచ్చి బఠానీ తీసుకోవాలి.