పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సెషన్లో ఉపాధి హామీ(MNREGA) స్థానంలో 125 రోజుల పనిదినాలు కల్పించే ‘VB-G RAM G’ బిల్లుకు, AI టెక్నాలజీ నియంత్రణ కోసం ‘శాంతి’ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే పౌర అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతినిచ్చే బిల్లు కూడా పాస్ అయ్యింది. 15 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.