E.G: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రతి నెల ఒక ప్రత్యేక అంశంతో స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 20న జిల్లాలోని అన్ని పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.