కృష్ణా: గుడివాడ వ్యవసాయ డివిజన్లో రైతులకు కావలసిన మేర 80% యూరియా వచ్చినట్లు ఏడీఏ కవిత తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. కావలసిన మేరకు యూరియా తీసుకుని వెళ్లాలని, నిల్వ ఉంచడం ద్వారా మిగిలిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గుడివాడ పరిధిలో 33 వేల యూరియా బ్యాగుల అవసరమైతే 28 వేలు రైతులకు అందించామన్నారు.