టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రోహిత్ భయ్యా బ్యాటింగ్ చేసే తీరు నిజంగా చాలా ప్రత్యేకమైనది. బంతి ఎంత వేగంగా వచ్చినా, బౌలర్ ఎంత స్పీడ్తో బౌలింగ్ చేసినా అది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపదు. చాలా సులువుగా షాట్లు కొట్టేస్తాడు’ అని రింకూ అన్నాడు.