కృష్ణా జిల్లాకు మరో రెండు రోజుల్లో 4,400 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కలెక్టర్ డీ.కే. బాలాజి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో యూరియా స్థితిగతులపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. అందరికీ కావలసినంత యూరియా అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.