KDP: టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జీ బిటెక్ రవి కృషితో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి బస్ సౌకర్యం కల్పించారని ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర తెలిపారు. ఇవాళ వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక, సిబ్బంది, ప్రజల సౌకర్యార్థం ఈనెల 11వ తేదీ నుంచి IIIT కి బస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.