TG: HYDలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.