ప్రకాశం: కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లె మండల ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రభుత్వ కంటి వైద్యులు డాక్టర్ సుదర్శన్ వైద్య పరీక్షలను నిర్వహించారు. దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలను ఉచితంగా ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులలో దృష్టిలోపం లేకుండా చేయడానికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తుందని అన్నారు.