VZM: వెలకట్టలేని విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు అని ఏపీ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర కల్కూర పేర్కొన్నారు. విద్యార్ధులు`గ్రంథాలయాల ఆవశ్యకత అనే పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును సీతం కళాశాల డైరక్టర్ డా ఎం.శశిభూషణరావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అధ్యక్షులు గురుప్రసాద్ మాటాడుతూ.. గ్రంథాలయాలను విద్యార్ధులు వినియోగించుకోవాలన్నారు.