AP: అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ప్రారంభం అయింది. ‘సూపర్ 6 సూపర్ హిట్’ పేరిట ఈ సభ నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్టేజీ పైకి ఎక్కారు. స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ‘సూపర్ 6 సూపర్ హిట్’ జెండాలతో ప్రజలకు నమస్కారం చేశారు.