ప్రకాశం: పుల్లలచెరువు మండలం మానేపల్లిలో ఇవాళ మధ్యాహ్నం ఆకస్మికంగా గాలులు వీస్తూ వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. పొలాలకు వెళ్లిన రైతులు ఎండల తీవ్రతతో ఉక్కపోతకు గురయ్యారు, కానీ చల్లటి గాలులు వీయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.