VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన బుధవారం మండలంలోని స్దానిక పిరిడి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో సమస్యలను ఎమ్మెల్యేకు సిబ్బంది వివరించారు.