MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు మరువలేనివని, మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.