TG: MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అధిష్టానం నుంచి పిలుపు వస్తే BJPలో చేరడానికి సిద్ధంగా ఉన్నా. నేను MLA పదవికి రాజీనామా చేయను.. ఏం చేస్తారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా. ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం. రామచందర్‌రావు రబ్బర్ స్టాంప్‌గా మారారు. BJP వేసిన కొత్త కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని అన్నారు.