KMM: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారితనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం TTDC మీటింగ్ హాల్లో మధిర నియోజకవర్గంలో చేపట్టనున్న పైలెట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సానుకూలంగా ఉన్న ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అధికారులను సూచించారు.