MBNR: భార్యను కోల్పోయిన బాధను తట్టుకోలేక.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. SI లెనిన్ తెలిపిన వివరాలు.. వీరన్నపల్లి వాసి ఎల్లయ్య(57) నాలుగేళ్ల కిందట భార్య పద్మమ్మను కోల్పోయి ఒంటరితనంతో బతికేవాడు. తాళలేని వేదనలో మంగళవారం పొలంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.