GNTR: యూరియా కొరతపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం సమంజసం కాదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. గుంటూరు అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో అధికారులతో సమీక్షించి ఎరువులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తమ నియోజకవర్గంలో రైతులకు సక్రమంగా ఎరువులు అందుతున్నాయని స్పష్టం చేశారు.