AP: సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పరిమితులు లేకుండా తల్లికి వందనం అమలు చేశాం. ఎంతమంది పిల్లలుంటే.. అంతమందికీ రూ. 15వేలు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరిగేలా మహిళలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఉచిత బస్సు జెట్ స్పీడులో వెళ్తుంది. అన్నదాత సుఖీభవతో రైతులకు అండగా నిలిచాం. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.