NLG: మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఉన్న హెటిరో కంపెనీ అనుబంధ సంస్థ “దశమి లాబ్స్ ఫార్మా” కంపెనీలో వనమహోత్సవంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతారని, సంరక్షణ లేక ఎండిపోతాయని, అలా కాకుండా నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు.