అన్నమయ్య: రామసముద్రం మండలం మినికి గ్రామంలో యూరియా నిల్వలు, పంపిణీ పై ఇవాళ మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పండించే ప్రతి ఎకరాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారికి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చాడు.