తమిళ హీరో అశోక్ నటిస్తోన్న ‘వడ మంజువిరట్టు’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. జల్లికట్టు సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. అశోక్‌పై ఎద్దు దాడి చేసింది. దీంతో ఆయన పక్కటెముకల వద్ద గాయం అయింది. వెంటనే మేకర్స్ అశోక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం ఆయన యధావిధిగా షూటింగ్లో పాల్గొన్నారు.