NLG: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణం పెద్ద బండ సెంటర్లో ఐలమ్మ చిత్రపటానికి బుధవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.