NGKL: తెలకపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న కార్వంగ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.