యూట్యూబర్ సప్నాగిల్‌తో వివాదం కేసులో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై కోర్టు రూ.100 జరిమానా విధించింది. సప్నాగిల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 13న క్రికెటర్ తరఫున న్యాయవాదికి చివరి అవకాశం ఇచ్చినా.. ఆయన ఇంకా స్పందించలేదని పేర్కొంది. పృథ్వీ షాకు మరో అవకాశం కల్పిస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 16కి వాయిదా వేసింది.