KMR: గాంధారి మండలం గౌరారం కలాన్లో ఉట్నూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎలెచ్పీ మహేశ్వరి, ఏఎన్ఎంలు అన్నపూర్ణ, సరిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.