కృష్ణా: కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ వద్ద యూరియా విక్రయాలను ఆకస్మికంగా పరిశీలించారు. యూరియా సరఫరా వివరాలు నమోదు చేయాలని, యూరియా పొందిన రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమోహన్, ఏవో కే.మురళీకృష్ణ, సొసైటీ సీఈవో లంకపల్లి రమేష్, వీఆర్వో తూము శ్రీనివాసరావు పాల్గొన్నారు.