ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల కోసం బుధవారం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అనంతపురంలో జరుగునున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ ఎఫెక్ట్‌తో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తుంది. 90 శాతం బస్సులను సభకు తరలించారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉన్నామని, ఒక్క బస్సు కూడా రాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.